ఆళ్లపల్లి: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

62చూసినవారు
ఆళ్లపల్లి మండలం బోడయికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యుత్, ఇరిగేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్