భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈనెల 12న మణుగూరు ప్రభుత్వ ఐటిఐలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటిఐ జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐటిఐ పూర్తి చేసుకున్న యువతి యువకుల కోసం నిర్వహిస్తున్న అప్రెంటిస్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.