జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ గురువారం ఘనస్వాగతం పలికారు. సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో ఆయనకు మొక్కలు, పుచ్చగుచ్ఛాలు అందజేశారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రోడ్డు మార్గంలో కొత్తగూడెం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి సారపాకకు బయల్దేరి వెళ్లారు. రాత్రికి సారపాకలోనే బస చేయనున్నారు.