Top 10 viral news 🔥
నేడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
శ్రీవారి లడ్డూ విషయంలో అపచారం జరిగిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పవన్ సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. కాగా, ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.