ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను చూసేందుకు వెళ్లి ప్రజలు ప్రమాదాలకు గురి కావద్దని కరకగూడెం ఎస్సై రాజేందర్ అన్నారు. ఆదివారం తాడ్వాయి- బయ్యారం రోడ్లో గల ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును ఎస్ఐ పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసరమైతే డయల్-100 కు ఫోన్ చేయాలన్నారు.