పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి అన్నా రు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సందర్బంగా మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హనుమాన్ జంక్షన్ నుండి ప్రారంభమైన సురక్షా బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. తొలుత పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు డీఎస్పీ రవీంధర్రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు.