భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా నడిమిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో లొద్దిగూడెం, పెద్దూరు గ్రామంలో 8.5 లక్షల విలువ గల సీసీ రోడ్డు, మార్కోడు గ్రామ పంచాయతీలో కనకదుర్గమ్మ గుడి ముందు ఎస్సీ కాలనీలో 7.5లక్షల విలువ గల రోడ్డు.. అలాగే
పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.