పినపాక: దేశాభివృద్ధిలో యువతదే కీలకపాత్ర: ఎమ్మెల్యే

64చూసినవారు
దేశాభివృద్ధిలో యువతదే కీలకపాత్రని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాకమండలం సింగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రహదారులను ప్రారంభించారు. కేబీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలను తిలకించారు. క్రికెట్, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన ఏడూళ్లబయ్యారం, పాండురంగాపురం జట్లకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్