కామేపల్లి మండల పరిధిలోని సాతాని గూడెం గ్రామ పంచాయతీ నందు కొమ్మినేపల్లి సబ్ సెంటర్ వైద్య బృందం ఉచిత ఆరోగ్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. ఐదు రోజులుగా కురుస్తున్న అటువంటి వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు చర్యగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్. ఎస్ కె. ఉస్మాన్ మాట్లాడుతూ.. ప్రధానంగా గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినవారికి మందులు వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేణుక రాణి, నవత, ఆశా కార్యకర్తలు కల్పన, పార్వతి, రూపీలి, మ్యాగీతి, మల్టీపర్పస్ వర్కర్లు రవి, రాములు తదితరులు పాల్గొన్నారు.