ఖమ్మంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంటాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యకి కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వీరన్న ఆధ్వర్యంలో వినతి పత్రం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, తదితరులు ఉన్నారు.