సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా జూదమాడినా, కోడిపందేలు నిర్వహించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇల్లందు సీఐ సత్యనారాయణ సోమవారం తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.