తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్(ట్రస్మా) ఇల్లెందు డివిజన్ కమిటీని శనివారం జవహర్ స్కూల్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా జవహర్ హైస్కూల్ కరస్పాండెంట్ కె. వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని హైస్కూల్ కరస్పాండెంట్ వి. మహేందర్, కోశాధికారిగా జక్కుల సర్వేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఒంగూరి శ్రీనివాస రావు, పలువురు సభ్యులు ఎన్నికయ్యారు.