ఇల్లందులో ప్రపంచ ఓజోన్ దినోత్సవం

662చూసినవారు
ఇల్లందులో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని సింగరేణి పాఠశాలలో శనివారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జివి మోహన్ రావు మాట్లాడుతూ ఓజోన్ పొరను దెబ్బ తీయుటకు  ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు అని వాటి వాడకాన్ని తగ్గించేందుకు అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓజోన్ పొరను రక్షించుకోవడం మనందరి బాధ్యతని, వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్