టిఏడియు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా తిరుమలరావు ఎన్నిక
తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఇల్లెందుకు చెందిన సముద్రాల తిరుమలరావు ఎన్నికయ్యారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో గురువారం తిరుమలరావును ఎన్నుకోవడం జరిగింది. తిరుమల రావు ఎన్నిక పట్ల స్థానిక ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.