హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు భారీ ఊరట

42344చూసినవారు
హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు భారీ ఊరట
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అప్రూవల్‌గా మారిన దస్తగిరి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు.

సంబంధిత పోస్ట్