వికారాబాద్ (D) లగచర్లలో గిరిజన రైతులు అరెస్ట్ అయితే తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా పని చేస్తారో లగచర్ల రైతుల కోసం కేటీఆర్ అంత కష్టపడ్డారని హరీశ్ రావు అన్నారు. 'వారి బెయిల్ కోసం, వారి విడుదల చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా KTR కష్టపడ్డారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. కేటీఆర్ కూడా పార్టీలో కార్యకర్తనే. ఒక కార్యకర్త కోసం, ఒక నాయకుడు కోసం ఎలాగైతే నిలబడ్డామో కేటీఆర్ కోసం నిలబడతాం' అని వ్యాఖ్యానించారు.