TG: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. అవినీతి జరిగినప్పటికీ విచారణ వద్దని కేటీఆర్ కోర్టుకు వెళ్లడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. దొంగలు, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేవారికి కోర్టులు సపోర్ట్ చేయవనే విషయాన్ని కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు.