స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి నిజంగా పండుగే తెచ్చింది. తెలంగాణలో ఈ నెల 11 నుంచి 17 వరకు 7 రోజులు సెలవులు ప్రకటించగా ఏపీ ప్రభుత్వం అంతకు మించి మరో 3 రోజులు సెలవు ఇచ్చింది. మొత్తం 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. జనవరి 20వ తేదీ సోమవారం తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.