మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ విజయంపై స్పందించిన కేటీఆర్

85చూసినవారు
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ విజయంపై స్పందించిన కేటీఆర్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు తమపైన బాధ్యతలు మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాడైనా, నేడైనా.. ఏనాడైనా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీనే అని అన్నారు.

సంబంధిత పోస్ట్