హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో టూరిస్టు కేంద్రాలైన కులు, మనాలీలో తెలుగు
విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు సమాచారం వచ్చింది. దాంతో ఆయన విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌కు అలర్ట్ చేశామని, సాయం కావాల్సిన వారు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌కు సంప్రదించాలన్నారు.