ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ‘X’ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసు నిర్వహణ అనేది తాను మంత్రిగా తీసుకున్న అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్ణయాల్లో ఒకటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచేయలేవన్నారు. 'పారదర్శకంగా రూ.46 కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్ ఎక్కడిది? ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు. ప్రతి పైసాకు లెక్క ఉంది' అని అన్నారు.