ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

53చూసినవారు
పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో సిద్ధాంతం చుట్టూ స్థిరంగా నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాక కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శనేత అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఏచూరి చిత్రపటానికి నివాళి అర్పించిన కేటీఆర్ సభలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్