ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో కేటీఆర్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరఫు లాయర్ చెప్పారు. కాగా ఫార్ములా-ఈ కారు రేసులో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.