రోజుకి సరిపడా నిద్ర లేకుంటే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా విడుదలై ఒత్తిడికి, అతిగా ఫుడ్ తీసుకోవడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు తెలిపారు. నిద్రలేమితో శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటం, హై బీపీ పెరగడమే కాక రోగనిరోధక శక్తి తగ్గడం, మెదడు పనితీరు తగ్గడం, ఆలోచనలపై ప్రతికూల ప్రభావం పడి, చిన్న విషయాలకి తీవ్రంగా స్పందించడం వంటి సమస్యలతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు.