సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

64చూసినవారు
సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల
వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి కేసులో అరెస్టైన రైతులు సంగారెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదల అయ్యారు. వీరికి గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. రైతులకు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. గురువారమే రిలీజ్ కావాల్సింది. అయితే సాయంత్రం 6 గంటలలోగా వీరి బెయిల్ కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో ఇవాళ విడుదల చేశారు. కాగా,ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్