మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా.. 2021లో జరిగిన లఖింపుర్ ఖేరి రైతుల ఆందోళనల్లో ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.