ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భూ వివాదం కారణంగా రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై భారీ బండతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అలాగే, ఇరువర్గాలు పరస్పరం ఇటుకలు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో ఇళ్లు ధ్వంసం కాగా, పలువురు గాయపడ్డారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.