ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటంతో మరికొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ మేరకు హెల్గుగడ్-సుంగర్ మధ్య గంగోత్రి హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో పోలీసులు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గత కొన్నేళ్లుగా ఈ పాయింట్ డేంజర్ జోన్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.