లాటరల్ ఎంట్రీ విధానం.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి: రాహుల్‌గాంధీ

70చూసినవారు
లాటరల్ ఎంట్రీ విధానం.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి: రాహుల్‌గాంధీ
లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్