2018లో DB స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది. వీటిలో 120% వడ్డీని అందించే వార్షిక ప్లాన్, 54% అందించే సెమీ-వార్షిక ప్లాన్, 7% అందించే నెలవారీ ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి. అయితే, జూలై 2024 నుండి చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు వాపోయారు.