మంగళగిరిలో నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య

60చూసినవారు
మంగళగిరిలో నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా.. మురుగుడు లావణ్యకు ఇవ్వడంతో అక్కడ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్యను వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీలో నిలిపింది. మురుగుడు లావణ్యకు ఇవే తొలి ఎన్నికలు.

సంబంధిత పోస్ట్