అమెరికా అధ్యక్ష అభ్యర్థి, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కు దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ తన మద్దతు పలికారు. ఆర్ఎన్‌సీ వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో హల్క్ హోగన్ తనదైన శైలిలో చొక్కాను చించుకుని మరీ.. ట్రంప్‌కు తన సపోర్ట్‌ను తెలియజేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.