ఏపీలో వరద గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు ఐదు రోజుల పాటు వరదనీటిలో ఉండిపోయారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేశారు. సహాయక కార్యక్రమాలు బాగా చేశారు. త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తా’’అని చెప్పారు.