'బీమా రత్న' పాలసీతో 15 ఏళ్లలోనే మీ డబ్బు తిరిగి పొందవచ్చు. అనుకోకుండా పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే, కుటుంబ సభ్యులు జీవనం సాగించేందకు, వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్ధిష్ట కాలవ్యవధులలో డబ్బు నామినీకి అందేటట్లుగా పాలసీని రూపొందించారు. పాలసీ కాలవ్యధిలో లిక్విడిటీ అవసరాలకు పాలసీపై రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. 90 రోజుల పిల్లల నుంచి 55 ఏళ్ల వారు పాలసీని తీసుకోవచ్చు.