AP: టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ మహిళలకు తొలిసారిగా ఆస్తి హక్కు కల్పించారన్నారు. కానీ తల్లి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పని చేశారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు జగన్ కోర్టుకెళ్లారన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలాంటి పని చేయడం బాధాకరమన్నారు.