కరడుగట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీనటిని, ఆమె తల్లిదండ్రుల్ని కేసు పెట్టిన మరుసటి రోజు ఫిబ్రవరి 3న అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో ఏసీపీలు రమణమూర్తి, హనుమంతరావు, సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్సై షరీఫ్ ముంబై వెళ్లి వారిని విజయవాడ తీసుకొచ్చారు. మూడు రోజులు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ అతిథిగృహంలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఫిబ్రవరి 6న వారిని రిమాండ్కు పంపించారు. జైలు నుంచి వచ్చాక ముంబై వెళ్లిపోయారు. ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగు చూసింది.