ఆర్థిక ఇబ్బందులున్నా సవాల్‌గా తీసుకుని రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఒకేసారి రైతు రుణమాఫీ సాధ్యం కాదని అందరూ అన్నారని కానీ.. సీఎం సంకల్పం వల్లే రుణమాఫీ సాధ్యమైందని తెలిపారు. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పదేళ్లలో రూ. లక్ష రుణమాఫీ కూడా కేసీఆర్ చేయలేకపోయారని విమర్శించారు.