తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది. దీనిపై TG సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మెడికల్ అడ్మిషన్‌ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే... దేశవ్యాప్తంగా ఉన్నవారంతా 85% స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది. విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, వాటిని రూపొందించాలని తెలిపింది.