బొప్పాయి పండును ఉదయం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయ పడుతుంది. దీనిలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.