పంచముఖ ఆంజనేయుడిగా పూజలందుకుంటున్న హనుమంతుడు

81చూసినవారు
పంచముఖ ఆంజనేయుడిగా పూజలందుకుంటున్న హనుమంతుడు
లంక యుధ్దం జరగక ముందు ఒకసారి మైరావణుడు, రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు. అప్పుడు హనుమంతుడు.. పాతాళ లోకానికి వెళ్తాడు. అయితే మైరావణుడిని సంహరించాలంటే మైరావణపురంలో ఐదు దిక్కుల్లో వెలుగుతున్న దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే సాధ్యమవుతుంది. దీంతో ఆంజనేయుడు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేసి, మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచి ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్