ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రోటీని చూడండి. 12 అడుగులున్న ఈ రోటీని ఒక్కడే తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యి పొయ్యిపై ఇనుపగొట్టం లాంటి పెనం పెట్టి దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే 12 అడుగుల రోటీ ఇంకా ధృవీకరించబడలేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 2012 సెప్టెంబర్ 22న భారత్‌లో ప్రపంచంలోనే 10 అడుగుల అతిపెద్ద రోటీని తయారు చేశారు. దీని బరువు 145 కిలోలు.