హైదరాబాద్ లో ఆదివారం యువతి తండ్రిపై ఓ ప్రేమోన్మాది కాల్పులు జరిపాడు. అంబర్‌పేటకు చెదిన బల్వీందర్‌సింగ్(25), సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన ఓ యువతి(23) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం తెలియడంతో యువతిని ఆమె తండ్రి ఇటీవల అమెరికా పంపించారు. ఆదివారం యువతి ఇంటికి వచ్చిన యువకుడు.. యువతి తండ్రి రేవంత్‌తో ఘర్షణకు దిగాడు. తన వెంట తెచ్చిన గన్‌తో కాల్చడంతో తూటా రేవంత్ కంట్లో నుంచి దూసుకెళ్లింది. యువతి తండ్రిని ఆసుపత్రికి తరలించారు.