అచ్చంపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ఐదుగురికి గాయాలు

79చూసినవారు
అచ్చంపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ఐదుగురికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారి హాజీపూర్ చౌరస్తా వద్ద శనివారం హైదరాబాద్ వైపు నుండి రంగాపూర్ జాతరకు వస్తున్న కారు రెండు కార్లను అతి స్పీడ్ తో వచ్చి ఎదురుగా ఢీకొట్టడంతో బిలాల్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు వ్యక్తులకు గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ సంఘటనపై అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్