దుందుభి నదిలో ఓ జాలరుడికి వింత చేపలు చిక్కాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో గ్రామానికి చెందిన చీమర్ల మణిందర్ రోజువారిగా చేపల వేటకు వెళ్లాడు. శనివారం ఉదయం ఆయన నదిలో విసిరిన వలలో రెండు వింత చేపలు చిక్కాయి. ఒకటి పాము ఆకారంలో ఉన్న మలగమేను, మరొకటి వింత ఆకారంలో ఉన్న చేప చిక్కింది. మలగమేను జాతికి చెందిన చేప అరుదుగా లభిస్తుందని, దాని విలువ ఎంతో ఉంటుందని తెలిసింది.