భారీ వర్షం..నీట మునిగిన కాలనీ

50చూసినవారు
భారీ వర్షం..నీట మునిగిన కాలనీ
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డ్ బి. సి. కాలనీ శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి నీట మునిగింది. కాలనీలో రోడ్లు లేకపోవడంతో కాలనీలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు, ‌ ప్రజాప్రతినిధులు రోడ్డు వేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పటికైనా రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్