కరెంట్ షాక్ తో ప్రైవేట్ కార్మికుడు మృతి
అడ్డాకల్ మండలంలోని కాటారం తాండ దగ్గర విద్యుత్తు పనుల నిమిత్తం ఆ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో పనులు నిర్వహించారు. సబ్ స్టేషన్ లో లైన్ మెన్ ఆపరేటర్ గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు ఒక ఫీడర్ కి బదులుగా మరో ఫీడర్ విద్యుత్ సప్లై ఎల్ సి ఇవ్వడంతో ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు రవి మృతి చెందాడు. విద్యుత్ లైన్మెన్ గట్టన నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైందని మండల వాసులు విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు.