అడ్డాకల్ మండలం ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత, గ్రీనరీ పెంపు లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ. పరిశుభ్రత, గ్రీనరీ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.