గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి.దానితో నియోజకవర్గంలో విపరీతమైన చలి వేస్తుంది. నియోజకవర్గ ప్రజలను చలి వణికిస్తుంది. ఈ చలికి ప్రజలు ఉదయం పూట బయటికి రావడానికి భయపడుతున్నారు. ఉదయం ఎండా వచ్చాక వచ్చి సాయంత్రం చలి మొదలు కాకముందే ఇళ్లకు వెళ్ళడానికి చూస్తున్నారు. ఈ చలికి ప్రజలు తగిన జాగర్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.