మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన గొల్ల తిరుపతయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తిరుపతయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవరకద్ర మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.