ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థి మిస్సింగ్ అయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన ఓ విద్యార్థి కోయిలకొండ మండలంలోని బీసీ గురుకులలో 10 వ తరగతి చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ. ఆదివారం సాయంత్రం పాఠశాల నుంచి పారిపోయాడు. సోమవారం పాఠశాల సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.